గంగమ్మ జాతరలో ఘర్షణ.. ఒకరు మృతి

గంగమ్మ జాతరలో ఘర్షణ.. ఒకరు మృతి

కడప జిల్లా ఆలంఖనపల్లెలో గంగమ్మ జాతర సందర్భంగా అర్థరాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.  పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.