'కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి'
JGL: కోరుట్ల మండలంలో మొక్కజొన్న రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్ పన్నాల అంజిరెడ్డి మంగళవారం కలెక్టర్ సత్యప్రసాద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రైతులు పంటను అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే వారికి ఉపశమనం కలుగుతుందని తెలిపారు.