ఆలయ నిర్మాణానికి భూమి పూజ
SRD: నారాయణఖేడ్ పట్టణ శివారులోని పంచగామ కమాన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి మహారాజ్, ఎమ్మెల్యే డా. సంజీవరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు. పురోహితుడు మలమంచి మోహన్ జోషి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.