నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ
SRPT: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ కేంద్రాలను ఎస్పీ నరసింహ ఐపీఎస్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రూ. 50 వేలకు మించి నగదు తీసుకెళ్లకూడదని, సమస్యాత్మక వ్యక్తులను రూ. 5 లక్షలకు బైండోవర్ చేస్తున్నట్లు తెలిపారు.