VIDEO: ఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీలు ముమ్మరం
WGL: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వర్ధన్నపేట సర్కిల్ పరిధిలోని ఇల్లంద వద్ద ఏసీపీ అంబట నర్సయ్య ఆధ్వర్యంలో ఇవాళ పోలీసులు వాహన తనిఖీలు కఠినంగా నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా అక్రమ మద్యం, డబ్బు రవాణాను అరికట్టేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.