విషం ఇంజెక్షన్ తీసుకొని విద్యార్థి ఆత్మహత్య
MBNR: జడ్చర్ల మండలం పలుగుగడ్డ తండాకు చెందిన గిరిజన విద్యార్థి కాట్రావత్ సురేష్ (28) ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్ వేధింపులు తట్టుకోలేక విషం ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సురేష్ మృతిపై మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.