VIDEO: తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య: అదనపు కలెక్టర్
కామారెడ్డి ఐడీవోసీలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ మధు మోహన్ కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. భూమి, భుక్తి కోసం పోరాడి చిన్న వయసులోనే ప్రాణాలర్పించిన గొప్ప వీరుడు కొమురయ్య అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం సాగిందని పేర్కొన్నారు.