ఆటో బోల్తా పడి 5 మందికి గాయాలు

ప్రకాశం: కంభం మండలం జంగం గుంట్ల గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఆటో బోల్తా పడి ఐదు మంది తీవ్రంగా గాయపడ్డ సంఘటన గురువారం చోటుచేసుకుంది. గేదెలను తప్పించే క్రమంలో ఆటో బోల్తా పడినట్లుగా క్షతగాత్రులు చెబుతున్నారు. గాయపడ్డ వారిని కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను నాయకులు పరామర్శించారు.