VIDEO: వేట గిట్టుబాటు లేక మత్స్యకారుల ఆందోళన
VSP: డీజిల్ ధరలు పెరగడం, ఆశించిన స్థాయిలో చేపలు చిక్కకపోవడంతో విశాఖమత్స్యకారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేటకు వెళ్లేందుకు భారీ ఖర్చు అవుతున్నా ఆదాయం లేకపోవడంతో ఫిషింగ్ హార్బర్‌లో సుమారు 85 శాతం బోట్లు తీరానికే పరిమితమయ్యాయి. డీజిల్ సబ్సిడీ కార్డులు కూడా పనిచేయకపోవడంతో మత్స్యకారులపై అదనపు భారం పడుతోంది.