CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NLR: అనారోగ్యంతో బాధపడుతూ ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి అండగా ఉంటోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. విడవలూరు మండలం పార్లపల్లికి చెందిన కేతిరెడ్డి సాయికుమార్ తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు CMRF నుంచి రూ.1.64 లక్షల చెక్కును నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో ఆమె అందజేశారు.