రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడకూడదు: కలెక్టర్
కర్నూలు: రహదారులపై గుంతల పూడ్చివేత పనులను వేగవంతం చేయాలని అదే విధంగా రోడ్ల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రోడ్లకు సంబంధించిన పాట్ హోల్స్ పనుల పురోగతిపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.