VIDEO: పాఠశాలలో అగ్నిప్రమాదం
GNTR: ప్రత్తిపాడు మండలం ప్రతిపాడు భవనం వెంకట్ రెడ్డి జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే పాఠశాలకు చేరుకుని మంటలను నియంత్రించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్నికీలలు ఎగిసిపడటంతో విద్యార్థులు భయంతో తరగతి గదులు వదిలి బయటకు పరుగులు తీశారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.