వర్మి కంపోస్టు తయారు సెంటర్ పరిశీలన
వనపర్తి మున్సిపాలిటీ సిబ్బంది వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, తడి, పొడి చెత్తను వేర్వేరుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ ఆదేశించారు. మంగళవారం కొత్తకోట మున్సిపాలిటీలోని నర్సరీలను, వర్మి కంపోస్టు తయారు సెంటర్‌ను పరిశీలించారు. నర్సరీల సందర్శనలో భాగంగా రాబోయే జూన్ నెలలో చేపట్టనున్న మొక్కలు నాటేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చెయ్యాలన్నారు.