విదుర నీతి: ఈ ఒక్కదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి

విదుర నీతి: ఈ ఒక్కదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి

మనిషి తన జీవితంలో డబ్బు కంటే తన 'శీలాన్ని' (క్యారెక్టర్) జాగ్రత్తగా కాపాడుకోవాలని విదురుడు బోధించారు. ధనం ఈరోజు వస్తుంది, రేపు పోతుంది.. పోయిన డబ్బును మళ్లీ కష్టపడి సంపాదించుకోవచ్చు. కానీ ఒకసారి చేజారిన నడవడిక, పోయిన పరువు మళ్లీ తిరిగి రావు. డబ్బు లేనివాడు ఎప్పటికీ పేదవాడు కాదు, కానీ వ్యక్తిత్వాన్ని కోల్పోయినవాడు జీవితంలో సర్వస్వం కోల్పోయినట్టే లెక్క అని విదురుడు చెప్పారు.