బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్?.. ఎమోషనల్ వీడియో
WWE దిగ్గజం, మాజీ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ బ్రాక్ లెస్నర్ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా రెజిల్మేనియా 42లో ఓబా ఫెమీ చేతిలో ఓటమి పాలైన అనంతరం లెస్నర్ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లతో అభివాదం చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. 10 సార్లు WWE ఛాంపియన్‌గా నిలిచిన ఈ 'బీస్ట్' రిటైర్మెంట్ వార్తతో ఆయన ఫ్యాన్స్ విచారంలో మునిగిపోయారు.