వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తవుతాయి

ప్రకాశం: పొదిలి జనసేన పార్టీ కార్యాలయంలో మార్కాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో శ్రావణి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.