శ్రీలలితాపీఠంలో ఘనంగా కూడారై ఉత్సవం

శ్రీలలితాపీఠంలో ఘనంగా కూడారై ఉత్సవం

VSP: ధనుర్మాసోత్సవాల్లో భాగంగా అక్కయ్యపాలెం శ్రీలలితాపీఠంలో కూడారై ఉత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. 108 గంగాళములతో విశేష పాయసాన్ని శ్రీభూ-నీలాసమేత కళ్యాణ వెంకటేశ్వరస్వామికి నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా చండీహోమం నిర్వహించారు. ఈ నెల 14న భోగి పండుగ రోజు ఉదయం గోదా రంగనాయకుల దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుందని పీఠం మేనేజర్ మన్నవ కృష్ణసేన్ తెలిపారు.