కుమ్మపల్లిలో నూకాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు

విజయనగరం: వేపాడ మండలం కుమ్మపల్లిలో నూతనంగా నిర్వహించిన నూకాలమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. యాగశాల ప్రవేశం, హోమాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం 6.40 నుంచి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, పూజలు నిర్వహిస్తామని పురోహితుడు భమిడిపాటి శ్రీనివాస్ శర్మ, కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం అన్న సమారాధన నిర్వహిస్తామని చెప్పారు.