విద్యార్థులు భోజనం చేసేందుకు సదుపాయం కరువు
NTR: విజయవాడ సనత్ నగర్‌లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది. మధ్యాహ్న భోజనం చేసేందుకు సరైన సదుపాయం కరువైంది. దీంతో విద్యార్థులు పాఠశాలలోని మట్టి నేలపైన, దిబ్బల పైన కూర్చుని భోజనాలు చేస్తున్నారు. ఈ దుర్భర పరిస్థితులపై సంబంధిత అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.