పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగింత

పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగింత

వరంగల్ రైల్వే స్టేషన్‌లో మహిళా ప్రయాణికురాలు పోగొట్టుకున్న సెల్ ఫోన్‌ను రైల్వే పోలీసులు గుర్తించి తిరిగి అప్పగించారు. మంగళవారం కాజీపేట బాపూజీనగర్‌కు చెందిన సాజిదా కేసముద్రం వెళ్లేందుకు స్టేషన్‌కు రాగా, ప్లాట్‌ఫాం నంబర్-1పై రూ.18 వేల విలువైన సెల్ ఫోన్‌ను పోగొట్టుకుంది. ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు దానిని గుర్తించి తిరిగి ఆమెకు అందజేశారు.