'ప్రమాదాలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి'
NZB: చేవెళ్ల మండలం మీర్జాపూర్ సమీపంలో చోటుచేసుకున్న బస్ ప్రమాదం దురదృష్టకరమని, ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని నిజామాబాద్ అర్బన్ MLA ధన్పాల్ సూర్య నారాయణ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి ఘోర ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్లక్ష్యంగా నడిపే కంకర టిప్పర్ల వలన అమాయక ప్రజల ప్రాణాలు బలికావడం విచారకరమన్నారు.