కందుకూరులో మద్యం షాపులపై అధికారుల నిర్లక్ష్యం

NLR: కందుకూరులో రెస్టారెంట్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. తెల్లవారుజామునే షాపులు తెరిచి మందుబాబులకు మద్యం అందిస్తున్నారు. ప్రభుత్వం ఉదయం 10 గంటలకు షాపులు తెరచి, రాత్రి 10 గంటలకు మూసివేయాలన్న జీవో జారీ చేసినా అమలుపరచడం లేదు. ఎక్సైజ్ అధికారులు వైన్‌షాపులు, బెల్ట్ షాపులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా మామూల్ల మత్తులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు తెలిపారు.