జీవిత ఖైదు.. ఆ 12 మంది వీరే..!
NDL: ఆళ్లగడ్డలో 2012లో వైసీపీ నేత ఇంజేటి క్రిష్ణారెడ్డి, ఆయన భార్య, కుమారుడు సహా నలుగురి హత్య కేసులో 12 మందికి జీవిత ఖైదు పడిన విషయం తెలిసిందే. శిక్ష పడిన వారిలో ఇంజేటి శివకుమార్రెడ్డి, కుందూరు రామిరెడ్డి, హుస్సేన్ వలి, కమల్, మహబూబ్ బాషా, బాబు బాషా, చిన్న మాబు, పక్కీర్ వలి, చాంద్బాషా, అంకాలు, తిరుపాలు, మాల లక్కు శ్రీనుగా పోలీసులు వెలువరించారు.