విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

BDK: జూలూరుపాడు మండలం జడలచింతాలో గురువారం జరిగిన అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.