ట్యాంక్‌బండ్ చేరుకున్న ఖైరతాబాద్ బడా గణేశ్
HYD: ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి జులూస్‌ను తిలకిస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి గణేశ్ నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన భారీ క్రేన్ను పరిశీలించారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుండి నెక్లెస్ రోడ్ వరకు ఎక్కడ చూసినా జనాలే™ కనిపిస్తున్నారు. మధ్యాహ్నం 1:30లోపు భారీ విగ్రహాన్ని నిమజ్జనం చేయనున్నారు.