కారును ఢీకొట్టిన టిప్పర్.. ముగ్గురికి గాయాలు

కారును ఢీకొట్టిన టిప్పర్.. ముగ్గురికి గాయాలు

NTR: ఏ.కొండూరు మండలం రామచంద్రపురం శివారు బాడవ టోల్ ప్లాజా వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తుపల్లి నుంచి విజయవాడ వెళ్తున్న కారును టిప్పర్ లారీ ఢీకొనడంతో కారులోని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం టిప్పర్ ఆగకుండా వెళ్లిపోయింది. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.