ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే గిడ్డి

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే గిడ్డి

కోనసీమ: పి.గన్నవరం మండలంలోని కె. ఏనుగుపల్లి గ్రామ పంచాయతీ వద్ద స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని కృషి చేస్తోందని తెలిపారు. పేద కుటుంబాలకు అండగా నిలిచే సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు.