'నిరుద్యోగుల ఆవేదన సదస్సును జయప్రదం చేయాలి'

'నిరుద్యోగుల ఆవేదన సదస్సును జయప్రదం చేయాలి'

అన్నమయ్య: ఈ నెల 17న విజయవాడలో జరగనున్న నిరుద్యోగుల ఆవేదన సదస్సును జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు దార్ల రాజశేఖర్ సోమవారం పిలుపునిచ్చారు. ఖాళీ పోస్టుల భర్తీ, నిరుద్యోగ భృతి, పరిశ్రమల్లో స్థానిక యువతకు 70% ఉద్యోగాలు, ప్రభుత్వ విద్యాలయ ఖాళీల భర్తీ, ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ, వాలంటీర్‌లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలన్నారు.