వేసవిపై జిల్లాస్థాయి అధికారులతో జేసీ సమీక్షా సమావేశం
కోనసీమ: అమలాపురం కలెక్టరేట్‌లో వేసవి ఉష్ణోగ్రతల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై జిల్లాస్థాయి అధికారులతో JC నిశాంతి సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ.. హిట్ వేవ్స్ సందర్భంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆరోగ్య భద్రతకై తగు జాగ్రత్తలు పాటించేలా సమాజంలో విస్తృత అవగాహన పెంపొందించాలని అధికారులను ఆదేశించారు.