'బుడగ జంగాలకు ఎస్సీ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి'

'బుడగ జంగాలకు ఎస్సీ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి'

GNTR: గుంటూరు జిల్లా సీపీఐ కార్యదర్శి కోట మాలాద్రి ఆదివారం పెదకాకాని, వెనిగండ్ల గ్రామాల్లో పర్యటించారు. వెనిగండ్లలో బుడగ జంగాల కాలనీ సందర్శించి అక్కడ వారి స్థితిగతులను విచారించారు. గతంలో బుడగ జంగాలకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేవారని, ఇప్పుడు ఇవ్వటం లేదని వారు తెలిపారు. బుడగ జంగాలకు ఎస్సీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని మాల్యాద్రి డిమాండ్ చేశారు.