ఏఐతో కోర్టు తీర్పులను సృష్టిస్తున్నారు: సుప్రీంకోర్టు

ఏఐతో కోర్టు తీర్పులను సృష్టిస్తున్నారు: సుప్రీంకోర్టు

కృత్రిమ మేధ దుర్వినియోగంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఏఐతో కోర్టు తీర్పులనూ సృష్టిస్తున్నారని తెలిపింది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా న్యాయస్థానాల్లో ఈ సమస్య పెరుగుతోందని చెప్పింది. వ్యాజ్యదారులు, లాయర్లు కూడా ఏఐతో జనరేట్ చేసిన అవాస్తవ తీర్పులను ప్రస్తావిస్తున్నారని పేర్కొంది. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ధర్మాసనం సూచించింది.