పోచారం ప్రాజెక్టులోకి పెరుగుతున్న ఇన్​ఫ్లో

పోచారం ప్రాజెక్టులోకి పెరుగుతున్న ఇన్​ఫ్లో

KMR: ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల వరప్రదాయిని పోచారం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గాంధారి పెద్దవాగు, తాడ్వాయి భీమేశ్వరం వాగుల ద్వారా ప్రాజెక్టులోకి వరద వస్తోంది. 120 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువలోకి విడుదల చేస్తున్నారు. రెండు మండలాల్లో వేసిన 12వేల ఎకరాలకు నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.