రెసిడెన్షియల్ స్కూల్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్
SRPT: తిరుమలగిరి మండలం తొండలో రూ. 200 కోట్లతో నిర్మిస్తున్న 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్' పనులను కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ బుధవారం పరిశీలించారు. నిర్మాణంలో నాణ్యత పాటించాలని, అదనపు సిబ్బందిని పెట్టి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థ పటిష్టతకు పెద్దపీట వేస్తోందని ఆయన పేర్కొన్నారు.