పోచమ్మ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ
NGKL: వంగూరు మండల కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ దేవాలయ నిర్మాణానికి సోమవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాదయ్య, దేవాలయ కమిటీ అధ్యక్షుడు శివకుమార్ పాల్గొన్నారు. గ్రామ నాయకులు, కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థుల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు.