అగ్నిప్రమాదంలో జొన్న పంట దగ్ధం

అగ్నిప్రమాదంలో జొన్న పంట దగ్ధం

ADB: జైనథ్ మండలం దీపాయిగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో జొన్న పంట కాలిపోయింది. వేసవికాలంలో పంట పొలాల దూరలకు (గట్లకు) నిప్పంటించే క్రమంలో మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది. గిరిధర్ రెడ్డికి చెందిన మూడెకరాల జొన్న పంట కాలి బూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే వేసేసరికి పంటంతా కళ్లముందే కాలిపోవడంతో రైతు బాధపడిన తీరు అందరికీ కన్నీరు తెప్పించింది.