అంగరంగ వైభవంగా ఇందూరులో ఆరట్టు ఉత్సవం

అంగరంగ వైభవంగా ఇందూరులో ఆరట్టు ఉత్సవం

NZB: ‘స్వామియే శరణమయ్యప్ప’ నామస్మరణతో ఇందూరు నగరం మార్మోగింది. అయ్యప్ప దేవాలయ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని అయ్యప్ప ఆలయం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా, పాత కలెక్టరేట్ చౌరస్తా, పోచమ్మ గల్లీ, గోల్ హనుమాన్, పెద్ద బజార్, గాజుల్ పేట్ మీదుగా రఘునాథ చెరువు వరకు శోభాయాత్ర కొనసాగింది. శోభాయాత్ర ఆద్యంతం దారి పొడవున రంగవల్లులు, ప్రసాద వితరణతో కోలాహలంగా మారింది.