అన్న క్యాంటీన్‌లో వారికి నో టోకెన్

అన్న క్యాంటీన్‌లో వారికి నో టోకెన్

ప్రకాశం: ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ సమీపాన అన్న క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన ఓ బోర్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అన్న క్యాంటీన్ వద్దకు ఎందరో ప్రజలు తమ ఆకలిని తీర్చుకునేందుకు వస్తుంటారు. అదే సమయంలో మద్యం ప్రియులు అన్న క్యాంటీన్ వద్ద హల్చల్ చేస్తున్న నేపథ్యంలో నిర్వాహకులు 'మద్యం తాగి వచ్చిన వారికి టోకెన్ ఇవ్వబడదు' అంటూ బోర్డులో పేర్కొన్నారు.