BREAKING: మాజీమంత్రికి నోటీసులు
AP: మద్యం అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. వారిని ఎల్లుండి విచారణకు రావాలని ఆదేశించింది. ఈ మేరకు ప.గో.జిల్లాలోని కారుమూరి ఇంటికి సిట్ నోటీసులు అంటించింది. వైసీపీ హయాంలో మద్యం రవాణాలో అక్రమాలు జరిగినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే సిట్ పలువురి విచారించిన విషయం తెలిసిందే.