ఎవరికీ పెరోల్ సిఫారసు చేయను: కోటంరెడ్డి

AP: రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో వైసీపీ దష్ర్పచారం చేస్తోందని MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. శ్రీకాంత్‌కు పెరోల్ ఇవ్వాలని ఆయన తండ్రి, సోదరుడు వస్తే సిఫారసు లేఖ ఇచ్చానన్నారు. లేఖలు సాధారణం, అధికారులు నిర్ణయం తీసుకుంటారని, రాజకీయ జీవితంలో ప్రతిదీ గుణపాఠమేనని చెప్పారు. ఇకపై భవిష్యత్‌లో ఎవరికీ పెరోల్ సిఫారసు చేయనని పేర్కొన్నారు.