రామాయంపేటలో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు

రామాయంపేటలో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు

MDK: మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రామాయంపేట ఎక్సైజ్ ఎస్సై విజయ్ సిద్ధార్థ్ హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని మెదక్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల రవాణాను అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.