'ప్రతి రైతుకి ప్రభుత్వం అండగా ఉంటుంది'
కృష్ణా: మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆదివారం మచిలీపట్నంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. తుఫాన్ సమయంలో సీఎం క్షేత్రస్థాయిలో అధికారులను అప్రమత్తం చేయడంతో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొన్నారని తెలిపారు.