'ప్రజాదర్బార్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి'

అనంతపురం: ప్రజాదర్బార్ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం నగరంలోని ఆర్.అండ్.బీ అతిథి గృహంలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని మంత్రి నిర్వహించారు.