మెదక్లో 5,857 ఇందిరమ్మ ఇళ్ల పనులు షురూ
MDK: జిల్లాలో మంజూరైన 9,181 ఇందిరమ్మ ఇళ్లలో 5,857 ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయని హౌసింగ్ పీడీ మాణిక్యం తెలిపారు. ఇంకా 3,324 ఇళ్ల పనులు మొదలుకాలేదన్నారు. ఇప్పటివరకు వివిధ దశల్లో ఉన్న ఇళ్లకు రూ. 45 కోట్లు చెల్లించినట్లు వివరించారు. 400 అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్న లబ్ధిదారులుపై అంతస్తులో కూడా ఇల్లు నిర్మించుకోవచ్చని ఆయన సూచించారు.