రోడ్డు ప్రమాదంపై మంత్రి విచారం వ్యక్తం
TPT: నగరి మండలం తడుకుపేట సమీపంలో రెండు కార్లు ఢీకొని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ పోటు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి మండిపల్లి స్పందించారు. ఘటన బాధాకరమని, సంతాపం వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతపై ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.