రోహిత్ శర్మపై అఫ్రిది ప్రశంసలు

రోహిత్ శర్మపై అఫ్రిది ప్రశంసలు

వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన తన రికార్డును రోహిత్ శర్మ బ్రేక్ చేయడంపై పాక్ మాజీ కెప్టెన్ అఫ్రిది స్పందించాడు. రికార్డులు బద్దలు కొట్టబడటానికే ఉంటాయన్నాడు. 'నేను ఇష్టపడే ఆటగాడు నా రికార్డును బద్దలు కొట్టినందుకు సంతోషంగా ఉంది' అని ప్రశంసించాడు. డెక్కన్ ఛార్జర్స్‌కు ఆడినప్పుడే రోహిత్ బ్యాటింగ్‌ను గమనించానని, అతని క్లాస్ తనను ఆకట్టుకుందని అన్నాడు.