పట్టుబడిన నగదుపై కేసు నమోదు
WG: లక్ష్మణేశ్వరంలో పాస్టర్ జాన్ బాబు ఇంట్లో తనిఖీలలో పట్టుబడిన నగదుపై కేసు నమోదు చేసినట్లు నరసాపురం రూరల్ సీఐ దుర్గా ప్రసాద్ తెలిపారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. సీజ్ చేసిన నగదు రూ.2.27కోట్లకు సంబంధించి గంటా జాన్ బాబురావు, ఆయన భార్య ఝాన్సీ రాణి, అల్లుడు శాంసన్లను పోలీసులు వివరణ కోరగా, వారు ఎటువంటి సరైన ఆధారాలు చూపలేకపోయారని తెలిపారు