మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు: కేటీఆర్

మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు: కేటీఆర్

TG: ఉపరాష్ట్రపతి ఎన్నికపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల విషయంలో ఏ పార్టీ కూడా తమను సంప్రదించలేదని చెప్పారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ.. తెలంగాణ నుంచి బీసీ అభ్యర్థి దొరకలేదా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో బీసీలను మర్చిపోయారని ఆరోపించారు. కంచె ఐలయ్య లాంటి వారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎందుకు ఎంచుకోలేదని ఆయన ప్రశ్నించారు.