కర్మాగారం ఎదుట కార్మికుల ఆందోళన

కర్మాగారం ఎదుట కార్మికుల ఆందోళన

VSP: విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో HPCL కర్మాగారం ఎదుట శుక్రవారం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు బైఠాయించారు. పెరుగుతున్న నిత్యవసర ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనం ఉండాలని వారు డిమాండ్ చేశారు. కర్మాగార యాజమాన్యం వెంటనే కార్మికుల సమస్యలపై దృష్టి సారించాలని, లేనిపక్షంలో మిగిలిన సంఘాలతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.