మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు చెల్లించాలని ధర్నా

మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు చెల్లించాలని ధర్నా

NRPT: మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు చెల్లించాలని సోమవారం ధన్వాడ ఎంఈఓ కార్యాలయం ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఎంఈఓ గాయత్రికి వినతి పత్రం అందించారు. సీపీఎం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న బిల్లులతో పాటు 18 నెలలుగా పెండింగ్‌లో ఉన్న గుడ్ల బిల్లులు చెల్లించాలని కోరారు. బిల్లులు చెల్లించని పక్షంలో వంటలు చేయడం ఆపేస్తామన్నారు.