మహిళా శక్తి చీరలు పంపిణీ చేసిన డీసీసీ ఉపాధ్యక్షులు
NLG: శాలిగౌరారం మండలంలోని ఊట్కూరు గ్రామంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను ఇవాళ డీసీసీ ఉపాధ్యక్షులు అన్నెబోయిన సుధాకర్ పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధి కోసం ఉచిత బస్సు, 500కే గ్యాస్ సిలిండర్ లాంటి సంక్షేమ పథకాలు అందిస్తుందని తెలిపారు. వారి వెంట గ్రామ శాఖ అధ్యక్షులు కుర్ర లింగయ్య తదితరులు ఉన్నారు.